Rajini


రజనీ నలబై యేళ్ళుగా సినిమాలలో ఉన్నారు . ఎపుడూ వాళ్ళ నటుల సంఘాల వివాదములో గానీ , రాజకీయ వివాదాలలోగానీ తలదూర్చలేదు.దేశ వ్యాప్తంగానే కాదు చైనా, జపాన్, మలేషియా వంటి ఇతర దేశాలలో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. తన చిత్రాల ద్వారా నష్టపోయిన డిష్త్రిబ్యూటర్లకు డబ్బులు కూడా చెల్లించి తన మంచి తనము చాటుకున్నారు. అటువంటి నటుడి గూర్చి నేనెక్కడా వినలేదు మన దేశములో ఇంతవరకూ.ఆయన ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తున్నారో, లేక పరోక్షరాజకీయాలలో ఉంటారో కూడా విడమరచి చెప్పలేదు.. చూచాయగా అభిమానులకు సూచించారు. అది అభిమానుల కోరిక కావొచ్చు మరేదైనా కావొచ్చు. సినిమా నటులు ఎం జీ ఆర్ . రామారావు, జయలలిత తరువాత అంతగా రానించిన వారు లేరు.నటీనటులు ఎన్నికల్లో ఎంపిక అయినా , చట్ట సభలకు ప్రాతినిథ్యం వహించినా ప్రజలకు వాళ్ళు ఒరగ బెట్టిందేమీ లేదు.కాబట్టి సినిమా నటుల సేవలు, మాటలు అవన్నీ కేవలం సినిమాల వరకే.. వారు ప్రజా సేవ చేస్తారు.. మనలను ఉద్ధరిస్తారు అనే అపోహనుండి ప్రజలు బయటకు రావాలి. డబ్బులకు, మద్యానికి, కులపు వారు, మనకు తెలిసినవారు , మనకు అవసరం అయితే ఏదో మేలు చేయగలడు, తన పరపతితో కేసుల నుండి బయటకు తేగలడు అన్న సంకుచితత్వాన్ని మానుకోవాలి.. ప్రజలందరినీ సమభావనతో చూడని వారు నాయకులు ఎలా అవుతారు..ఇప్పటికైనా ధనిక సమాజానికి వోట్లు అమ్మడం మానుకోవాలి.. సేవా భావముతో , అంకిత భావముతో తన మన భావన లేకుండా అందరితో సమ భావం కలిగి ఉండే వ్యక్తులను ఎన్నుకోవాలి. అలాంటి వారు ఎక్కడ ఉన్నారు మాకు చూపించండి అంటారా? మీలోనే, మీతోబాటే మీ ఇరుగు పొరుగులలోనే మీ ఊరిలోనే ఉంటారు. మంచి వారిని ఎన్నుకోండి. ఒకవేళ అలా సేవా భావముతో మంచి తనం ఉన్న వాళ్ళు రాజకీయాలలో లేరా? ప్రజలైన మీరే వారిని ఒప్పించి తీసుకు రావాలి..మేమంతా అండగా ఉన్నాము.. మీరే మా నాయకుడు అని ఎన్నుకునే తీరు రావాలి. మరి డబ్బులు కావాలి కదా ఎన్నికల ప్రచారానికి అనుకుంటున్నారా ? మంచి పాలన కోసం సైతం ప్రజలే ముందడుగు వేయాలి. మంచి వారు రాజకీయాలో నేతి బీరకాయలో నేతి చందం అండీ అంటే కుదరదు..మంచి నాయకున్ని ఎన్నుకునే బాధ్యత మన అందరిదిన్నూ. యాథారాజా తథా ప్రజా కాదు.. యథ ప్రజా.. తథా రాజా అని కూడా మనం నిరూపించవచ్చు. ప్రజలలో మార్పు వస్తే చచ్చినట్టు పార్టీలు మారక తప్పదు. అలాగే తేనెపూసిన కత్తుల వలే మంచితనముతో నమ్మించి అమ్ముడు పోయే నాయకులూ ఉంటారు.. తస్మాత్ జాగ్రత్త..తస్మాత్ జాగ్రత్త..తస్మాత్ జాగ్రత్త. మంచి అన్నది పెంచుదాం. మంచి నాయకున్ని ఎన్నుకుందాం మంచి పాలనను చవిచూద్దాము భవిష్యత్తుని తీర్చి దిద్దుకుందాము

Comments