Facebook


అవునూ ఫేస్బుక్ లో చాలామంది స్నేహ హస్తం చాస్తూ ఉంటారు. అలా అందరికీ ఆమోదం తెలిపి మిత్రులుగా కలుపుకోవాలా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. నేనైతే మిత్రులుగా కలుపుకునేప్పుడు నేను వారు స్త్రీలు కానీ పురుషులు నిరభ్యంతరంగా వారి ప్రొఫైల్ చూస్తాను. చాట్స్ చేయను. వారి పోస్ట్స్ ఎలా ఉంటాయి.. బాధ్యతాయుతమైన సత్ప్రవర్తన ఉందా లేదా అన్నది గమనిస్తాను. అలా లేని యొడల వారు మిత్రులుగా ఉండటానికి అనర్హులే. వాక్ స్వాతంత్ర్యం ఉందన్న నెపముతో విషపు మాటలు కక్కే వారు మనకు మిత్రులుగా అవసరమా? మన సంస్కృతిని , భారతీయతను గౌరవించని వారిని, కులపు గజ్జితో కునారిల్లి పోయేవారిని, వితండ వాదనలు చేస్తూ జాతి గౌరవం మంట గలిపేవారిని వారు ఎవరు కానీ అలాంటివి గమనిస్తే మిత్రుల లిస్ట్ నుండి తొలగించేస్తాను. మనకు ఎవరైనా ఫ్రెండ్ రెక్వెస్ట్ పంపితే వారు పార్టీల పెయిడ్ వర్కర్సా, ఫేక్ అకౌంట్స్ నా, మంచి విషయాల మీద అవగాహన, వారికి సామాజిక బాధ్యత ఉందా లేదా.. ఇవన్నీ గమనించంది కానీ నేను మిత్రులుగా అంగీకరించను.. ఎవరికైనా నేను పోస్ట్ చేసేవి నచ్చి ఫాలో అయితే అవవచ్చుగాక, మిత్రులుగా ఉండాలి అంటే మాత్రం వారికి సాంఘిక మాధ్యమాలను సక్రమంగా వాడే అవగహాన.. సత్ప్రవర్తన అవసరమే . లేదా కోరి కొరివితో తల గోక్కున్నట్టే. మంచి మిత్రులను ఎన్నుకోండి మంచి భావనలు పంచుకోండి మంచి అన్నది పెంచరండి మంచిగా జీవించ రండి

Comments

Popular Posts